: బీహార్ ప్యాకేజీపై నితీశ్ కుమార్ అసహనం... ప్రకటనలో స్పష్టత లేదని మండిపాటు
బీహార్ కు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన భారీ ప్యాకేజీపై సీఎం నితీశ్ కుమార్ విమర్శలు చేశారు. ప్యాకేజీ ప్రకటించిన ప్రధాని దాన్నెలా అమలు చేస్తారో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ప్యాకేజీ ప్రకటన చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు. ప్యాకేజీని ఎన్ని సంవత్సరాల్లో అమలు చేస్తారు, ఏడాదా, రెండేళ్లా, మూడేళ్లా? అనేది స్పష్టత ఇవ్వాలని నితీశ్ డిమాండ్ చేశారు. లేక ప్యాకేజీని కేంద్రమే నేరుగా అమలు చేస్తుందా? లేక రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయిస్తుందా? అనేది చెప్పాలన్నారు. అసలు బీజేపీయే ఓ అబద్ధాల కోరు అని ధ్వజమెత్తారు. చెప్పే మాటలకు, చేతలకు పొంతనే ఉండదని విమర్శించారు.