: మరో మూడు దశాబ్దాల్లో ఇండియా అంత పరిమాణంలో అడవులు మాయం
అభివృద్ధి పేరుతో ప్రపంచ వ్యాప్తంగా అటవీ నిర్మూలన భారీ ఎత్తున కొనసాగుతోంది. ఇదీ రీతిలో నిర్మూలన కొనసాగితే మరో మూడు దశాబ్దాల్లో ఏకంగా భారతదేశం అంతటి పరిమాణంలో అడవులు మాయమవుతాయట. వాషింగ్టన్ లోని 'సెంటర్ ఫర్ గ్లోబల్' అనే సంస్థ ఈ చేదు నిజాలను వెల్లడించింది. ఉపగ్రహ ఛాయా చిత్రాలు, దాదాపు వంద దేశాల్లోని సమాచారాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఈ సంస్థ ఈ సంగతిని తేల్చి చెప్పింది. 2050 నాటికి 289 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో ఆయనరేఖా ప్రాంతంలోని అడవులు మాయం అవుతాయని హెచ్చరించింది. కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని, ఆక్సిజన్ ను వదులుతూ చల్లదనానికి కారణమవుతున్న అడవులను ఇలాగే నరుకుతూ పోతే... మరో 35 ఏళ్లలో 169 బిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ అదనంగా వచ్చి చేరుతుందని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పనిచేస్తున్న 44 వేల థర్మల్ విద్యుత్ కేంద్రాలు విడుదల చేస్తున్న కార్బన్ డై ఆక్సైడ్ కు ఇది సమానమని చెప్పింది.