: శ్రీశైలంలో మొదలైన విద్యుదుత్పత్తి... ఏపీ తాగు నీటి అవసరాలకు నీటి విడుదల ప్రారంభం
శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో నేటి ఉదయం విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఏపీలో తాగు నీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు నీటిని కిందకు విడుదల చేయాలని కృష్ణా నీటి యాజమాన్య బోర్డు నిన్న స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేటి ఉదయం 7.30 గంటలకు శ్రీశైలం జలాశయం నుంచి అధికారులు నీటి విడుదలను ప్రారంభించారు. నీటిని కిందకు వదులుతున్న నేపథ్యంలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.