: భద్రాచలం బస్టాండ్ వద్ద కానిస్టేబుల్ తుపాకీ మిస్ ఫైర్
ఖమ్మం జిల్లా భద్రాచలం బస్టాండ్ లో తుపాకీ మిస్ ఫైర్ ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ తుపాకీ పొరబాటున ఫైర్ అయిందని తెలిసింది. తుపాకీ పేలిన వెంటనే అక్కడి ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టారు. అయితే అందులోని నాలుగు బుల్లెట్ లు నేలకు తాకడంతో ప్రమాదం తప్పింది. తుపాకీ మిస్ ఫైర్ ఎలా అయ్యిందన్న అంశంపై ప్రాథమిక విచారణ చేస్తున్నారు.