: సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట జగన్ ధర్నా
విజయవాడలోని సీఆర్ డీఏ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధర్నా చేస్తున్నారు. నవ్యాంధ్ర రాజధానిలో భూసేకరణకు వ్యతిరేకంగా ఆయన ధర్నాకు దిగారు. రైతుల నుంచి అన్యాయంగా భూములు తీసుకోవద్దంటూ కోరుతున్నారు. ఈ ధర్నాలో ల్యాండ్ పూలింగ్ కింద ఇప్పటికే భూములు కోల్పోయిన, భూసేకరణ పేరుతో భూములు కోల్పోనున్న రైతులు, వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతుల గొంతుపై కత్తిపెట్టి భూసేకరణకు చంద్రబాబు పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు.