: తెలంగాణ పొమ్మంది, ఆంధ్రా కాదంది... కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న అభాగ్యుడు


తన కుమార్తెకు ఏ తెలుగు రాష్ట్రంలోనూ ఉద్యోగం రాదన్న మనస్తాపంతో ఓ తండ్రి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. రాష్ట్ర విభజన అనంతరం నెలకొన్న పరిస్థితులు, తెలుగు ప్రభుత్వాల బాధ్యతారాహిత్యం ఎలా ఉందన్న విషయానికి ఈ ఘటన సజీవ సాక్ష్యం. వివరాల్లోకి వెళితే, పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరుకు చెందిన దుర్గా ప్రసాద్ కు నిఖిల అనే కుమార్తె ఉంది. ఆమె వరుసగా నాలుగేళ్లు రంగారెడ్డి జిల్లాలో చదువుకుంది. రాష్ట్ర విభజన తరువాత, నిఖిలకు స్థానికత లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేయగా, వరుసగా నాలుగేళ్లు ఏపీలో చదవలేదన్న కారణం చూపుతూ, డీఎస్సీ రాసేందుకు ఆంధ్రా అధికారులు నిరాకరించారు. దీంతో తన కూతురికి ఉద్యోగం రాదని మనస్తాపం చెందిన దుర్గాప్రసాద్, ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయన్ను తాడేపల్లిగూడెం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News