: జైలు వ్యాన్ లో దాడులకు తెగబడ్డ ఖైదీలు...ఇద్దరు మృతి


జైలు వ్యాన్ లో ఖైదీలు పరస్పర దాడులకు తెగబడిన ఘటన తీహార్ జైలులో చోటుచేసుకుంది. ఢిల్లీలోని రోహిణి కోర్టులో ఖైదీలను హాజరుపరిచి తీహార్ జైలుకు తరలిస్తుండగా, జైలు వ్యాన్ లో రెండు వర్గాలుగా విడివడ్డ ఖైదీలు పరస్పర దాడులు చేసుకున్నారు. వ్యాన్ లో 9 మంది ఖైదీలు ఉండగా, ఏడుగురు ఖైదీలు ఒక గ్రూపు, కేవలం ఇద్దరు మరో గ్రూపుగా విడిపోయారని, దాడిలో ఏడుగురు గ్రూపుదే పైచేయి అయిందని, దీంతో వారిద్దరూ మృతి చెందారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. కాగా, దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News