: గుంటూరు జిల్లాలో కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం
గుంటూరు జిల్లా వినుకొండలో ఓ నాలుగంతస్తుల భవనం కుప్పకూలింది. భవనం ఒకవైపు ఒరిగినట్టు ఉండటాన్ని గమనించిన ఇంటి యజమాని ఈ ఉదయమే భవనం నుంచి అందరినీ ఖాళీ చేయించాడు. దీంతో, పెను ప్రమాదం తప్పింది. ఈ భవనం కూలి పక్కనున్న ఇళ్లపై పడటంతో... మరో మూడు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరికీ హాని కలగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పిల్లర్ లేకుండా భవనాన్ని నిర్మించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు.