: అభిమానులకు ఆ హక్కు ఉంది: రణ్ బీర్ కపూర్


సినిమా నటులను విమర్శించే హక్కు అభిమానులకు ఉందని బాలీవుడ్ యువ నటుడు రణ్ బీర్ కపూర్ స్పష్టం చేశాడు. సినిమా విజయం సాధించినప్పుడు జేజేలు కొట్టే అభిమానులు, సినిమాలు నిరాశపరిచినప్పుడు విమర్శించడం సహజమని అన్నారు. 'రాయ్', 'బాంబే వెల్వెట్' సినిమాలు పరాజయంపాలైన తరువాత 'తమాషా' సినిమాతో అభిమానుల ముందుకు వచ్చేందుకు రణ్ బీర్ కపూర్ సిద్ధమవుతున్నాడు. 'తమాషా' సినిమా ప్రమోషన్ లో భాగంగా రణ్ బీర్ మాట్లాడుతూ, సినిమాను ఎంపిక చేసుకునేది తానే కనుక సినిమా ఫ్లాప్ అయినా, సక్సెస్ అయినా అందులో తనకు భాగం ఉంటుందని తెలిపాడు. సినిమా అలరించాలనే లక్ష్యంతో అభిమానులు సినిమా చూస్తారు, వారిని మెప్పిస్తే ఆకాశానికి ఎత్తేస్తారని రణ్ బీర్ చెప్పాడు. తనపై నమ్మకంతో సినిమా చూసేందుకు వచ్చిన అభిమానులను నిరాశపరచినప్పుడు, వారు విమర్శించడంలో తప్పులేదని అన్నాడు. అయితే నటుడికైనా, క్రీడాకారుడికైనా పొగడ్తలు, విమర్శలు సమానంగా తీసుకోగలిగిన సామర్థ్యం ఉండాలని రణ్ బీర్ కపూర్ అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News