: ప్రత్యేక హోదా రాదు: స్పష్టంగా చెప్పిన బాబు


ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నోటి నుంచి 'రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదు' అన్న మాట తొలిసారిగా వచ్చింది. ఈ ఉదయం మోదీతో చర్చల అనంతరం, ఆయన మాట్లాడుతూ, ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14వ ఫైనాన్స్ కమిషన్ నివేదిక, ఇతర నిబంధనలు అడ్డుగా ఉన్నాయని తెలిపారు. అందుకోసమే ఇంతవరకూ ప్రత్యేక హోదాపై పట్టుబట్టిన తాము, ఆ స్థాయికి సమానంగా రాయితీలు వచ్చేలా ప్యాకేజీలపై ఒత్తిడి పెంచనున్నామని, ఇందుకోసం స్పష్టమైన హామీలు, సమాధానం కోసం డిమాండ్ చేశామని వివరించారు. పదేపదే ప్రత్యేక హోదాపై మీడియా అడుగుతున్న ప్రశ్నల్లో కొన్నింటికి ఆయన సమాధానాలు దాటవేశారు. "స్పెషల్ స్టేటస్ ఇవ్వలేమన్నారు. 14వ ఫైనాన్స్ కమిషన్ అన్నారు. స్పెషల్ స్టేటస్ కాదన్నారు. లేదంటే ఇంకొకటి అంటున్నారు. ఏంటి?... ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తే మీకెంత డబ్బులు వస్తాయో... దానికంటే ఎక్కువ డబ్బులొచ్చేలా ప్యాకేజీ ఇస్తామంటున్నారు. ఓకే, అదే చెప్పండి... మీరు ఏమిస్తారో?" అని ప్రశ్నించినట్టు తెలిపారు. ప్యాకేజీకి మీరు అంగీకరిస్తున్నారా? అని అడుగగా, "నేను అంగీకరించడం కాదయ్యా! ఫస్ట్ నా డిమాండ్ స్పెషల్ స్టేటస్సే. వారు కాదని ఇంకా వేరే... ఇంకా ఎక్కువ డబ్బులిస్తామన్నారనుకో... ఇంక బాధేంటి ఎక్కువ డబ్బులిస్తే? నేను కాదనను కదా? కోడలు మగబిడ్డను కంటానంటే... అత్త వద్దంటుందా?" అని జోకేశారు.

  • Loading...

More Telugu News