: కేంద్రం నుంచి డబ్బులొస్తూనే ఉన్నాయి: చంద్రబాబు


కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టంలో పొందుపరిచిన అన్ని అంశాలపై సహాయం అందుతూనే ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ మధ్యాహ్నం ప్రధాని మోదీతో సుదీర్ఘంగా సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. లోటు బడ్జెట్ ను పూడ్చుకునేందుకు ఇప్పటికే కేంద్రం నుంచి రూ. 2,300 కోట్లు లభించాయని తెలిపారు. రూ. 350 కోట్లు వెనుకబడిన జిల్లాలకు అందాయని, ఒక్కో జిల్లాకు రూ. 50 కోట్లు చొప్పున 7 జిల్లాలకు వాటిని పంచామని, రాజధాని నిర్మాణం నిమిత్తం రూ. 1500 కోట్లు వచ్చాయని, మూలధనం అలవెన్సుల కింద 15 శాతం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 250 కోట్లు వచ్చాయని గుర్తు చేశారు. వీటితో పాటు ఐఐటీ, ఐఐఎం, ఐఐఐటి, ఎన్ఐటి, కస్టమ్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ వంటి విద్యా సంస్థలు వచ్చాయని తెలిపారు. ఇవన్నీ ఈ సంవత్సరం వచ్చాయని, ఇందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపామని వివరించారు.

  • Loading...

More Telugu News