: మరోసారి తెగబడ్డ పాక్ బలగాలు... భారత జవాను మృతి
పాకిస్థాన్ మరోసారి తన వంకర బుద్ధిని ప్రదర్శించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. జమ్ము కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా నవ్ గామ్ సెక్టార్ లో పాక్ బలగాలు కాల్పులకు తెగబడ్డాయి. ఈ కాల్పుల్లో ఓ భారత జవాను ప్రాణాలను కోల్పోయాడు. అప్రమత్తమైన భారత బలగాలు పాక్ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయి.