: రంగారెడ్డి జిల్లాలో 12వేల లీటర్ల డీజిల్ నేలపాలు!


రంగారెడ్డి జిల్లా ధరూర్ మండలం ఒంటిమామిడి చెట్టు గ్రామంలో 12వేల లీటర్ల డీజిల్ నేలపాలైంది. హైదరాబాద్ నుంచి తాండూరుకు వేగంగా వెళుతున్న డీజిల్ ట్యాంకర్ గ్రామ శివారులోని మలుపు వద్ద అదుపుతప్పడంతో బోల్తా కొట్టింది. దాంతో ట్యాంకర్ లోని డీజిల్ లీక్ అయింది. దీంతో స్థానికులు డీజిల్ ను పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాగా ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ కు ఈ ఘటనలో తీవ్ర గాయాలయ్యియి. వారిని ఆసుపత్రికి తరలించగా డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. విషయం తెలిసిన పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు.

  • Loading...

More Telugu News