: రాఖీ పౌర్ణమి నాడు జగన్ బంద్ కు పిలుపునివ్వడం సరికాదు: ఎమ్మెల్యే ప్రభాకర్


ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ ఈ నెల 29న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బంద్ కు పిలుపునివ్వడంపై ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తేదీన బంద్ కు పిలుపునివ్వడం అవివేకమని అనంతపురం జిల్లాలో మీడియాతో అన్నారు. ఆ రోజున రాఖీ పౌర్ణమి, అధికార భాషా దినోత్సవం ఉన్నాయని చెప్పారు. అయినా ఆ రోజు బంద్ చేయాలనడం శోచనీయమన్నారు. సామాజిక స్పృహ లేకుండా జగన్ బంద్ కు పిలుపునిచ్చారని, పునరాలోచించుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News