: విభజన చట్టంలోని హామీలకు కట్టుబడి ఉన్నాం... కీలక భేటీ తర్వాత అరుణ్ జైట్లీ ప్రకటన


ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మధ్య కీలక భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. భేటీ తర్వాత చంద్రబాబుతో కలిసి బయటకు వచ్చిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాతో క్లుప్తంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ చెప్పారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్వతోముఖాభివృద్ధికి సహకారం అందిస్తామని కూడా మోదీ హామీ ఇచ్చారని జైట్లీ వెల్లడించారు. ఏపీ అభివృద్ధి, విభజన చట్టంలోని హామీల అమలు కోసం ప్రత్యేక రోడ్ మ్యాప్ రూపొందించాలని నీతి ఆయోగ్ సీఈఓ అరవింద్ పనగారియాకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారని కూడా ఆయన చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించిన జైట్లీ అన్నీ విభజన చట్టంలోనే ఉన్నాయని ఒక్క వాక్యంతో వాటికి సమాధానాలు దాటవేశారు.

  • Loading...

More Telugu News