: 'హోదా'పై ఒక్క మాటా లేదు... చట్టంలో ఉన్నది మాత్రమే అమలవుతుంది: జైట్లీ


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో మరోమారు నిరాశే మిగిలింది. ఈ ఉదయం మోదీతో సమావేశం అనంతరం అరుణ్ జైట్లీతో కలసి మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు, ఒక్క మాట కూడా మాట్లాడకుండా, "విడిగా మీడియా సమావేశం నిర్వహిస్తా" అంటూ వెళ్లిపోయారు. అంతకుముందు జైట్లీ మాట్లాడుతూ, విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలనూ తాము నెరవేరుస్తామని అన్నారు. చంద్రబాబుతో అన్ని విషయాలూ చర్చించామని, ఆర్థిక సంఘం చేసిన సిఫార్సుల విషయమూ చర్చకు వచ్చిందని జైట్లీ వివరించారు. ప్రత్యేక హోదాపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించబోగా, సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మాత్రమే చెప్పిన ఆయన, ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్న సంకేతాలు పంపారు.

  • Loading...

More Telugu News