: నిద్రలోనే తుది శ్వాస విడిచిన కిష్టారెడ్డి... ఉదయం నిద్ర లేవకపోవడంతో గుర్తించిన కుటుంబసభ్యులు
మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల కిష్టారెడ్డి నిద్రలోనే తుది శ్వాస విడిచారు. నిన్న రాత్రి దాకా బాగానే ఉన్న కిష్టారెడ్డి రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. తెల్లవారిన తర్వాత రోజు మాదిరిగా ఆయన నిద్ర లేవలేదు. కిష్టారెడ్డి నిద్ర లేవని విషయాన్ని గుర్తించిన ఆయన కుటుంబసభ్యులు ఆయనను నిద్ర లేపేందుకు యత్నించారు. ఎంతకీ ఆయనలో చలనం లేకపోవడంతో హుటాహుటిన కిమ్స్ కు తరలించారు. కిష్టారెడ్డిని పరిశీలించిన అక్కడి వైద్యులు రాత్రి నిద్రలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు.