: తెలంగాణ ఆలయాల్లో పూజలు బంద్... అర్చకుల సమ్మె ప్రారంభం


కొత్త రాష్ట్రం తెలంగాణలో సమ్మెల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఔట్ సోర్సింగ్ కార్మికులు, మునిసిపల్, పంచాయతీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ప్రభుత్వం నానా పాట్లు పడి వీరితో సమ్మెను విరమింపజేసింది. తాజాగా అర్చకులు కూడా సమ్మెకు దిగారు. 010 పద్దు కింద వేతనాలు విడుదల చేయాలన్న ప్రధాన డిమాండ్ తో నేటి ఉదయం తెలంగాణ అర్చకులు విధులు బహిష్కరించి సమ్మె మొదలుపెట్టారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రధాన ఆలయాల్లో పూజాదికాలు నిలిచిపోయాయి. హైదరాబాదు చిక్కడపల్లిలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా సమావేశమైన అర్చకులు సమ్మెకు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరేదాకా సమ్మె విరమించేది లేదని ప్రకటించారు.

  • Loading...

More Telugu News