: పురుషాధిక్యంపై టాప్ లెస్ గా కదంతొక్కిన మహిళలు


పురుషాధిక్యంపై తరాలుగా పోరాడుతున్న మహిళలు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 60 ప్రముఖ నగరాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అంతర్జాతీయ మహిళల సమానత్వం 95వ వార్షికోత్సవంగా హాలీవుడ్ నటి, మోడల్ రాచెల్ జెస్సీ పిలుపునిచ్చిన 'గో టాప్ లెస్', 'నిపుల్ ఫ్రీ'కు స్పందించిన మహిళలు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. అమెరికాలోని న్యూయార్క్ పలువురు మహిళలు సిటీలో నాభిపై భాగం నుంచి ఎలాంటి ఆచ్చాదన లేకుండా ఆందోళన నిర్వహించారు. నిక్కరుతో పురుషుడు రోడ్డు మీద నిర్లజ్జగా తిరుగుతున్నప్పుడు నిపుల్ ఫ్రీగా మహిళలు ఎందుకు తిరగలేరంటూ సవాలు విసిరారు. 'మీ స్వేచ్ఛకు మేము అడ్డం కాదు...మాకు స్వేచ్ఛనివ్వండి' అంటూ నినదించారు. అన్ని రంగాల్లో ఆడవాళ్లను అణచివేస్తున్నారని ఆరోపించిన రాచెల్ జెస్సీ, మొదట తమ శరీరాలకు స్వేచ్ఛనివ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే మెదడు స్వేచ్ఛగా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. కాగా, అమెరికాలోని న్యూయార్క్ లో టాప్ లెస్ గా తిరిగేందుకు 1992 నుంచి స్వేచ్ఛ ఉంది. అయినప్పటికీ అక్కడ మహిళలు ఆందోళన నిర్వహించడం విశేషం. ఎక్కడ ఆందోళన చేసిన ఫర్వాలేదు కానీ, న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్దకు రావద్దని మేయర్ చేసిన విజ్ఞప్తిని కూడా అతిక్రమించి, మహిళలు కదంతొక్కారు. వాషింగ్టన్ డీసీలో దేశాధ్యక్ష భవనం దగ్గర స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహంలా నిలబడి నిరసన తెలిపారు.

  • Loading...

More Telugu News