: సల్మాన్ అంటే భయపడిన సొట్టబుగ్గల సుందరి
బాలీవుడ్ లో సొట్టబుగ్గల సుందరి ఎవరంటే "ప్రీతీ జింతా" అని ఇట్టే చెప్పేస్తారు. కెరీర్ లో 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమ్మడు అభిమానులతో లైవ్ చాట్ చేసింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. తన కెరీర్లో కండలరాయుడు సల్మాన్ ఖాన్ తో 5 చిత్రాల్లో నటించానని తెలిపింది. అయితే, సల్మాన్ తో నటించకముందు అతడంటే భయపడేదాన్నని చెప్పింది. ఇతరులతో అలాంటి పరిస్థితి ఎదురుకాలేదని, సల్మాన్ విషయానికొచ్చేసరికి భయంగా ఉండేదని వివరించింది. సల్మాన్ సిగ్గరి అని కూడా తెలిపింది. తన సహనటుల్లో ఎవరంటే ఇష్టమన్న ప్రశ్నకు బదులిస్తూ, రాణీ ముఖర్జీ పేరు చెప్పింది. ఇక, ఎమోషనల్ సీన్లలో తనను ఏడిపించగలిగే నటుడు షారుఖ్ ఖాన్ అని తెలిపింది. ఆయనతో ఎన్నో సీన్లలో ఏడ్చేశానని తెలిపింది. ప్రీతీ... షారుఖ్ తో 'దిల్ సే', 'వీర్ జారా', 'కల్ హో నా హో' చిత్రాల్లో నటించింది.