: జపాన్ దిశగా మహోగ్ర 'గోనీ'


ఫిలిప్పీన్స్ లో 26 మందిని బలిగొని, వేలాది మందిని నిరాశ్రయులను చేసిన గోనీ టైఫూన్ ఇప్పుడు జపాన్ దిశగా మహోగ్ర వేగంతో దూసుకువస్తోంది. గోనీ విరుచుకుపడడంతో ఫిలిప్పీన్స్ లో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదలు ముంచెత్తాయి. ఇప్పుడీ టైఫూన్ తమ దేశం దిశగా వస్తోందన్న సమాచారంతో జపనీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అటు, రయోకు ద్వీపంలో గంటకు 159 మైళ్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తున్నాయి.

  • Loading...

More Telugu News