: భారత ఆస్కార్ జ్యూరీ చైర్మన్ గా నటదర్శకుడు అమోల్ పాలేకర్ నియామకం


ఆస్కార్ అవార్డుల విదేశీ చిత్రాల విభాగానికి భారత ఎంట్రీని ఎంపిక చేసే బాధ్యతను నటదర్శకుడు అమోల్ పాలేకర్ కు అప్పగించారు. ఆయనను భారత ఆస్కార్ జ్యూరీ చైర్మన్ గా నియమించారు. ఈ మేరకు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) సెక్రటరీ జనరల్ సుప్రాణ్ సేన్ మీడియాకు తెలిపారు. "17 మంది సభ్యుల భారత ఆస్కార్ జ్యూరీకి హెడ్ గా అమోల్ పాలేకర్ ను ఎంపిక చేశాం. ఆయన విఖ్యాత సినీ ప్రముఖుడు" అని పేర్కొన్నారు. కాగా, తన నియామకంపై పాలేకర్ హర్షం వ్యక్తం చేశారు. 2016 ఆస్కార్ అవార్డుల కోసం భారత చిత్రాల ఎంపిక, వడపోత ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని తెలిపారు. కాగా, 88వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అమెరికాలోని లాస్ ఏంజెలిస్ లో ఫిబ్రవరి 28న జరగనుంది. హాలీవుడ్ చిత్రాలతోనే సరిపెట్టకుండా, ఉత్తమ విదేశీ చిత్రం విభాగం ద్వారా ప్రపంచ దేశాల చిత్రాలను కూడా ప్రోత్సహిస్తున్నారు.

  • Loading...

More Telugu News