: గుడుంబా నుంచి రక్షించాలనే చీప్ లిక్కర్ ను తీసుకురావాలనుకున్నాం: తెలంగాణ మంత్రి పద్మారావు


తెలంగాణ రాష్ట్రంలో తీసుకురాబోతున్న చీఫ్ లిక్కర్ పై వస్తున్న ఆరోపణలపై మంత్రి పద్మారావు వివరణ ఇచ్చారు. గుడుంబా మహమ్మారితో గ్రామాల్లో 60 నుంచి 70 మంది చనిపోతున్నారని చెప్పారు. గ్రామాల్లో దానిని అరికట్టడమే తమ లక్ష్యమని తెలిపారు. రాష్టంలో ఒక్క లీటర్ కూడా గుడుంబా కనిపించకూడదని, కనిపిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుడుంబా మహమ్మారి నుంచి రక్షించాలనే చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టాలని అనుకున్నామన్నారు. అయితే, చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టే ప్రసక్తే లేదన్నారు. ప్రజలను రక్షించే ఉద్దేశంతో కొత్త పాలసీని తీసుకొస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న మద్యంపై పన్నులు ఎత్తివేసి ప్రజలకు వాటిని చౌక ధరలో అందిస్తామన్నారు. 90 ఎంఎల్ రూ.15కు, 180 ఎంఎల్ రూ.30 లకు అందిస్తామని మంత్రి చెప్పారు.

  • Loading...

More Telugu News