: సంగక్కరకు అరుదైన గౌరవం... బ్రిటన్ లో శ్రీలంక హైకమిషనర్ గా నియామకం
శ్రీలంక లెజెండరీ క్రికెటర్ కుమార సంగక్కరకు అరుదైన గౌరవం లభించింది. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైన కాసేపటికే అత్యున్నతమైన పదవి అతన్ని వరించింది. బ్రిటన్ లో శ్రీలంక హైకమిషనర్ గా సంగక్కరను లంక ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ప్రకటన చేశారు. 15 ఏళ్లుగా శ్రీలంక క్రికెట్ కు సంగక్కర ఎనలేని సేవలందించాడు. ఈ రోజు భారత్ తో ముగిసిన రెండో టెస్టే సంగకు చివరి మ్యాచ్. అయితే, క్రికెట్ లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన సంగక్కర చివరి మ్యాచ్ ను ఓటమితో ముగించడం కొసమెరుపు.