: తలసాని వ్యవహారంలో నేడు స్పీకర్ ను కలవనున్న టి.టీడీపీ
టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారంపై తెలంగాణ టీడీపీ మళ్లీ దృష్టి సారించింది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు స్పీకర్ మధుసూదనాచారిని కలవాలని నిర్ణయించుకున్నారు. తలసాని రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని కోరనున్నారు. ఈ విషయంపై గతంలో మూడుసార్లు టీడీపీ నేతలు స్పీకర్ ను కలిశారు. ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిన స్పీకర్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అందుకే మళ్లీ కలసి గతంలో ఇచ్చిన హామీని గుర్తు చేయాలనుకుంటున్నారట. తలసాని విషయంలో అటు హైకోర్టు నోటీసు ఇచ్చి ప్రశ్నించినా ఎలాంటి స్పందన రాకపోవడం గమనార్హం.