: చీప్ లిక్కర్ పై తెలుగు మహిళల పోరు... టీ ఎక్సైజ్ ఆఫీస్ ముందు ధర్నా
తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టనున్న చీప్ లిక్కర్ పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా మహిళా లోకం రోడ్లపైకి వచ్చి నిరసనలతో హోరెత్తిస్తోంది. నిన్నటికి నిన్న బీజేపీ మహిళా విభాగం మహిళా మోర్చా తెలంగాణ ఆబ్కారీ శాఖ ప్రధాన కార్యాలయం ముందు నిరసనకు దిగింది. తాజాగా కొద్దిసేపటి క్రితం టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళా కార్యకర్తలు నాంపల్లిలోని ఎక్సైజ్ శాఖ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. గుడుంబాకు చెక్ పెట్టేందుకు వేరే ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని వాదించిన తెలుగు మహిళలు, తక్షణమే చీప్ లిక్కర్ ప్రతిపానదకు స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు.