: టీడీపీ గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి అమరం వినోద్ పై నిర్భయ కేసు
గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ కార్యదర్శి, గాంధీనగర్ డివిజన్ జవహర్ నగర్ కు చెందిన అమరం వినోద్ పై చిక్కడపల్లి పోలీసులు నిర్భయ కేసు నమోదు చేశారు. నగరంలోని దోమలగూడ రిలయన్స్ అపార్ట్ మెంట్ లో ఉంటున్న ఓ వివాహిత మహిళతో (గాయకురాలు కూడా) వినోద్ కు ఫైనాన్స్ విషయంలో కొంతకాలం కిందట పరిచయం ఏర్పడిందని ఇన్ స్పెక్టర్ ఎన్ఎల్ ఎన్ రాజు తెలిపారు. అప్పటి నుంచి వారిద్దరూ సన్నిహితంగా ఉంటున్నారని, ఈ మధ్య విభేదాలు రావడంతో మాట్లాడుకోవడం లేదని వివరించారు. దాంతో ఆమెను లైంగికంగా వేధిస్తూ, చంపుతానని బెదిరిస్తున్నాడని సదరు మహిళ రెండు రోజుల కిందట వినోద్ పై ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే అతనిపై నిర్భయ కేసు నమోదు చేశామన్నారు.