: పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాయపాటి
గుంటూరు జిల్లా నరసరావుపేట టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు కోపం వచ్చింది. పోలీసుల వ్యవహారశైలిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వేధిస్తున్నారంటూ సాక్షాత్తు ఓ మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసినప్పటికీ, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ ఘటనకు బాధ్యుడైన నరసరావుపేట రూరల్ సీఐ శరత్ బాబుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని... లేకపోతే, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి, డీజీపీల దృష్టికి తీసుకెళతానని హెచ్చరించారు. సామాన్యులకు సైతం న్యాయం జరిగేలా పోలీసు వ్యవస్థ పనిచేయాలని అన్నారు.