: రైతుల వద్దకు పవన్ వెళ్లడంలో తప్పులేదు: జూపూడి


కేవలం చర్చల ద్వారానే భూసేకరణ సమస్యను పరిష్కరించుకోగలమన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరైనవని... ఆ వ్యాఖ్యలతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు అన్నారు. టీడీపీకి ఓటు వేయాలని ఎన్నికల సమయంలో ప్రజలను కోరిన పవన్ కు... రైతుల వద్దకు వెళ్లే హక్కు ఉందని చెప్పారు. గుంటూరు జిల్లాలోని పెనుమాకలో పవన్ కల్యాణ్ ప్రసంగించిన అనంతరం... హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీడియాతో జూపూడి మాట్లాడారు. భూమిని బలవంతంగా సేకరించకూడదని... రైతులను ఒప్పించిన తర్వాత మాత్రమే తీసుకోవాలని పవన్ చేసిన సూచనను తాము పాటిస్తామని చెప్పారు. పవన్ చేసిన సూచనను ఇతర పార్టీల నేతలు కూడా పాటించాలని సూచించారు.

  • Loading...

More Telugu News