: నేను బానిసను కాను... సొంత అన్నయ్యనే వదులుకుని వచ్చినవాడిని: పవన్ కల్యాణ్


ప్రజా సంక్షేమం కోసమే తాను టీడీపీ, బీజేపీలతో కలసి పనిచేశానని పవన్ కల్యాణ్ తెలిపారు. కొత్త రాష్ట్రంలో జగన్ కంటే చంద్రబాబు పాలనే బాగుంటుందనే ఉద్దేశంతోనే చంద్రబాబుకు మద్దతు ఇచ్చానని చెప్పారు. వ్యక్తిగతంగా తాను ఏ పార్టీకి, ఏ వ్యక్తికీ అనుకూలం కాదని తెలిపారు. టీడీపీకి మద్దతు ప్రకటించిన సమయంలో... తానేమీ ఎమ్మెల్యేలు, ఎంపీ, పదవులు కావాలని అడగలేదని స్పష్టం చేశారు. మిత్రపక్షంలో ఉన్నంత మాత్రాన తాను బానిసను కాదని కుండబద్దలు కొట్టారు. తాను అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నానని కొందరు టీడీపీ నేతలు అంటున్నారని... ఏం చేసినా చూస్తూ ఊరుకుంటే మంచివాడినా? లోపాలను ఎత్తి చూపితే అభివృద్ధికి ఆటంకం కలిగించినట్టా? అని పవన్ ప్రశ్నించారు. అభివృద్ధికి ఆటంకం కలిగించే వాడినైతే టీడీపీకి ఎందుకు మద్దతిస్తాను? అన్నారు. నా చిత్తశుద్ధిని శంకిస్తే ఊరుకోనని హెచ్చరించారు. ప్రజలకు అండగా నిలబడటం కోసం తండ్రి లాంటి సొంత అన్నయ్య (చిరంజీవి) నే వదులుకుని వచ్చానని చెప్పారు.

  • Loading...

More Telugu News