: అది లాకప్ డెత్ కాదు... బీపీ, షుగర్ కారణంగానే పద్మ మృతి: డీసీసీ సత్యనారాయణ


హైదరాబాదులోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో గత రాత్రి జరిగిన లాకప్ డెత్ ఘటనపై డీసీపీ సత్యనారాయణ స్పందించారు. చోరీ కేసులో విచారణకు పిలిపించిన పద్మ అనే మహిళ పోలీసులు విచారిస్తుండగానే కుప్పకూలి మరణించిందని వార్తలొచ్చాయి. అయితే పద్మ పోలీసుల విచారణ కారణంగా చనిపోలేదని డీసీపీ పేర్కొన్నారు. బీపీ, షుగర్ తో బాధపడుతున్న పద్మ, వాటి కారణంగానే కన్నుమూసిందని తెలిపారు. ఈ ఘటనకు పోలీసుల థర్డ్ డిగ్రీ కారణం కానే కాదని ఆయన తేల్చిచెప్పారు. అయినా పద్మ చోరీకి పాల్పడలేదని, చోరీకి పాల్పడ్డ వారికి ఆశ్రయం మాత్రమే ఇచ్చిందని, ఈ విషయాలను నిర్ధారించుకునేందుకే ఆమెను స్టేషన్ కు పిలిపించామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News