: ఈ నెల 25 ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ


ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలకు సంబంధించి రాష్ట్ర ప్రజలంతా ఎదురుచూస్తున్న సమయం ఖరారైంది. ఈ నెల 25న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ మేరకు 25న ఉదయం 11 గంటలకు ప్రధాని అధికారిక నివాసానికి చేరుకోవాలని చంద్రబాబుకు సమాచారం అందింది. సమావేశం వేదిక, సమయాన్ని ఖరారు చేసిన ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులకు సమాచారం పంపింది. సుదీర్ఘంగా జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు ప్రధాని ముందు ఏకరువు పెట్టనున్నారు.

  • Loading...

More Telugu News