: పార్క్ హయత్ లో ప్రారంభమైన చిరు బర్త్ డే పార్టీ... త్రివిక్రమ్ తో కలిసి హాజరైన పవన్


టాలీవుడ్ మెగాస్టార్, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి బర్త్ డే పార్టీ హైదరాబాదులోని పార్క్ హయత్ హోటల్లో కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఫక్తు ప్రైవేటు ఫంక్షన్ లా నిర్వహిస్తున్న ఈ పార్టీకి టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు, నేతలు హాజరయ్యారు. చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ కూడా ఈ పార్టీకి విచ్చేశారు. పవన్ తన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి ఈ పార్టీకి హాజరయ్యారు. కాగా, అభిమానులు చిరంజీవి బర్త్ డే ఫంక్షన్ ను శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్క్ హయత్ లో నిర్వహిస్తున్న పార్టీ స్నేహితులు, ఇతర ప్రముఖుల కోసం ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News