: మనకు మిగిలింది తిరుపతి వెంకన్నే... అన్నీ తెలంగాణలోనే ఉన్నాయి: కామినేని
తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ మెడికల్ కాలేజీలో జరుగుతున్న అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ 38వ వార్షికోత్సవాలకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కార్పొరేట్ ఆసుపత్రులు, పరిశోధన సంస్థలన్నీ తెలంగాణలోనే ఉన్నాయని, మనకు మిగిలింది తిరుపతి వెంకన్న మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యరంగ పరంగా చూస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని స్పష్టం చేశారు. ప్రైవేట్ రంగం కలిసి వస్తే వైద్యరంగాన్ని అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు.