: ప్రత్యేక హోదా కోసం మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం... పరామర్శించిన చంద్రబాబు


ఏపీకి ప్రత్యేక హోదా అంశం మరింతగా రాజుకుంటోంది. మొన్న తిరుపతిలో మునికోటి అనే కాంగ్రెస్ కార్యకర్త ఆత్మాహుతికి పాల్పడడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ ఘటన మరువక ముందే కృష్ణా జిల్లా గుడివాడ మండలం పామర్రులో సుబ్బారావు అనే సామాజిక కార్యకర్త ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. అతడిని విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదన్న కారణంగానే అతడు మనస్తాపం చెంది బలవన్మరణానికి యత్నించినట్టు తెలిసింది. ఈ మేరకు సూసైడ్ నోట్ లభ్యమైంది. కాగా, ఏపీ సీఎం చంద్రబాబు ఆసుపత్రికి వెళ్లి సుబ్బారావును పరామర్శించారు.

  • Loading...

More Telugu News