: కొలంబో టెస్టులో పట్టుబిగిస్తున్న కోహ్లీ సేన


కొలంబో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోరును 306 పరుగులకే పరిమితం చేసిన కోహ్లీ సేన, తన రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 70 పరుగులు చేసి మూడో రోజు ఆట ముగించింది. తద్వారా శ్రీలంకపై 157 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. చేతిలో 9 వికెట్లున్నాయి. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 393 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. కాగా, నాలుగో రోజు ఆటలో నిలకడగా ఆడడం ద్వారా లంకకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించాలని టీమిండియా వ్యూహకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ మురళీ విజయ్ (39 బ్యాటింగ్), అజింక్యా రహానే (28 బ్యాటింగ్) ఉన్నారు. ఈ జోడీ రెండో వికెట్ కు అజేయంగా 67 పరుగులు జోడించింది. అంతకుముందు, ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్ (2) అవుటయ్యాడు.

  • Loading...

More Telugu News