: అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లిన పవన్
చాలా కాలం తరువాత హైదరాబాద్ లోని తన అన్నయ్య, సినీ నటుడు చిరంజీవి ఇంటికి ఈరోజు పవన్ కల్యాణ్ వెళ్లారు. అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరు కుటుంబ సభ్యులతో పవన్ దాదాపు 45 నిమిషాలు గడిపారని తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఓ హోటల్లో జరగనున్న చిరు పుట్టిన రోజు వేడుకలకు కూడా పవన్ హాజరవుతారని తెలుస్తోంది. కాగా చిరు నివాసానికి పవన్ రాకతో మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.