: ప్రతి అభిమానికి రుణపడి ఉంటాం: 'చిరు' అర్ధాంగి సురేఖ
ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో హైదరాబాదులోని ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ఆయన సతీమణి సురేఖ, పెద్ద కుమార్తె సుస్మిత పూజలు చేశారు. శనివారం ఉదయం ఆలయానికి విచ్చేసిన చిరు కుటుంబ సభ్యులు ఆంజనేయస్వామికి పూజలు నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. చిరంజీవి ఫ్యాన్స్ కు తామెప్పటికీ రుణపడి ఉంటామని సురేఖ పేర్కొన్నారు. ఆయన క్షేమం కోరుతూ ఏటా పూజలు చేస్తున్నారని కొనియాడారు. అందరూ క్షేమంగా ఉండాలని తమ కుటుంబం కోరుకుంటోందని తెలిపారు. చిరు తనయ సుస్మిత కూడా అభిమానులకు థ్యాంక్స్ చెప్పారు.