: శ్రీలంక 306 ఆలౌట్... రాహుల్ వికెట్ కోల్పోయిన భారత్
కొలంబో టెస్టులో శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 306 పరుగులకు ఆలౌటైంది. లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 4 వికెట్లతో లంకను దెబ్బతీయగా, అశ్విన్, ఇషాంత్ చెరో రెండు వికెట్లతో రాణించారు. దాంతో టీమిండియాకు 87 పరుగుల ఆధిక్యం లభించింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 393 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇక, రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కోహ్లీ సేన ఆరంభంలోనే ఓపెనర్ రాహుల్ వికెట్ చేజార్చుకుంది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన రాహుల్ ఈసారి 2 పరుగులతో సరిపెట్టుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు వికెట్ నష్టానికి 13 పరుగులు కాగా, క్రీజులో మురళీ విజయ్, అజింక్యా రహానే ఉన్నారు.