: ఆమ్ స్టర్ డామ్-పారిస్ రైల్లో కాల్పుల మోత


ఫ్రాన్స్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఆమ్ స్టర్ డామ్ నుంచి పారిస్ వెళుతున్న రైలులో ప్రవేశించిన ఆగంతుకుడు ఒక్కసారిగా తుపాకీ తీసి కాల్పులకు దిగాడు. తేరుకున్న ప్రయాణికులు అతడిని నిలువరించేందుకు ప్రయత్నించారు. అమెరికా రక్షణ దళాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు, తోటి ప్రయాణికులతో కలిసి అతడిని ఎదుర్కొన్నారు. ఆ దుండగుడిని చితకబాది, అతడి వద్ద ఉన్న కలాష్నికోవ్ రైఫిల్ ను లాగేసుకున్నారు. దాంతో, తన తుపాకీ ఇచ్చేయాల్సిందిగా ఆ వ్యక్తి ప్రాధేయపడ్డాడు. అతడిని అర్రాస్ సిటీ రైల్వే స్టేషన్ లో ఫ్రాన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి బ్యాగులో ఆటోమేటిక్ పిస్టల్, మందుగుండు, బాక్స్ కట్టర్ కూడా ఉన్నట్టు గుర్తించారు. కాల్పులకు తెగించిన ఆ దుండగుడు మొరాకో జాతీయుడని భావిస్తున్నారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. కాగా, ఆ సాయుధుడితో వీరోచితంగా పోరాడిన అమెరికా సైనికులను దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా అభినందించారు. త్వరితగతిన స్పందించి తెగువ చూపారని ప్రశంసించారు.

  • Loading...

More Telugu News