: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కాశ్మీర్ వేర్పాటువాద నేత నిర్బంధం


కాశ్మీర్ వేర్పాటువాద నేత షబ్బీర్ షాను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సమావేశమయ్యేందుకు ఆయన ఢిల్లీ వచ్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే షాను ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే పోలీసులు నిర్బంధించారు. వెంటనే ఆయన్ను గుర్తు తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారని తెలుస్తోంది. కాశ్మీర్ అంశంలో వేర్పాటువాదులతో చర్చలను కేంద్ర ప్రభుత్వం ముందునుంచీ వ్యతిరేకిస్తోంది. మూడో వ్యక్తి జోక్యం అవసరం లేదని ఇటీవల బీజేపీ కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకుని పాక్ కు వ్యతిరేక సందేశం పంపించినట్టు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News