: సిన్సియర్ థ్యాంక్స్ టూ మహేశ్ బాబు... బీజేపీ కిషన్ రెడ్డి ట్వీట్స్
టాలీవుడ్ యువ హీరో మహేశ్ బాబుకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖుల చేత శభాష్ అనిపించుకున్న ‘శ్రీమంతుడు’కు తాజాగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నుంచి కూడా గ్రీటింగ్స్ అందాయి. తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సూచన మేరకు వెనుకబడ్డ పాలమూరు జిల్లాలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు మహేశ్ బాబు సంసిద్ధత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కిషన్ రెడ్డి మహేశ్ బాబుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు కిషన్ రెడ్డి ట్విట్టర్ లో ‘‘తెలంగాణలోని పాలమూరు జిల్లాకు చెందిన గ్రామాన్ని దత్తత తీసుకున్న శ్రీమంతుడు మహేశ్ బాబుకు సిన్సియర్ థ్యాంక్స్ అండ్ బెస్ట్ విషెస్’‘ అని సందేశాన్ని పోస్ట్ చేశారు.