: ‘హోదా’పై వివాదాస్పద వ్యాఖ్యలు... గుంటూరులో కలకలం రేపుతున్న ఫ్లెక్సీలు


ఏపీకి ప్రత్యేక హోదాపై నవ్యాంధ్రలోని ప్రధాన నగరమైన గుంటూరులో వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి. నగరంలోని శంకర్ విలాస్ సెంటర్, అరండల్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జిల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ‘‘ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? ప్రత్యేక హోదాపై ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడితే డొక్క చీలుస్తాం. టాప్ లేచిపోద్ది, రంగు పడుద్ది’’ తదితర వ్యాఖ్యలతో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ పేరుతో ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. వీటిపై పలు ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News