: రెండేళ్లకు రూ.25 కోట్లు... ఐఓఎస్ స్పోర్ట్స్ తో సైనా నెహ్వాల్ భారీ అగ్రిమెంట్
భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఆటలోనే కాదండోయ్, ఆర్జనలోనూ దూసుకుపోతోంది. ఇప్పటికే టీమిండియా వన్డే, టీ20 జట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎండార్స్ మెంట్స్ పర్యవేక్షిస్తున్న రితి స్పోర్ట్స్ తో ఓ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్న సైనా, తాజాగా ఐఓఎస్ స్పోర్ట్స్ తోనూ కొత్తగా ఓ భారీ డీల్ ఓకే చేసుకుంది. రెండేళ్ల కాలానికి రూ.25 కోట్లు ఇచ్చేలా ఆమె ఆ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో రజత పతకం సాధించడం ద్వారా తిరిగి వరల్డ్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న మరునాడే ఆమె ఈ భారీ ఒప్పందంపై సంతకం చేయడం గమనార్హం.