: ఇకపై అలాంటి పని మాత్రం చేయొద్దు: వీరాభిమానికి మోదీ ఆత్మీయ సలహా


ప్రధాని నరేంద్ర మోదీకి కోట్లాది మంది అభిమానులున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే, ఈ అభిమాని మాత్రం చాలా విలక్షణం. పేరు బల్వంత్ కుమావత్. రాజస్థాన్ లోని భిల్వారా ప్రాంతానికి చెందిన యువకుడు. ఇతగాడో ప్రతినబూనాడు. ప్రధాని మోదీని కలిసేదాకా కాళ్లకు చెప్పులేసుకోనని శపథం చేశాడు. అన్నట్టుగానే అప్పటి నుంచి ఉత్త కాళ్లతోనే తిరుగుతున్నాడు. ఇప్పటికి అతని కోరిక తీరింది. కుమావత్ కు మోదీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. అతడి ప్రతిన గురించి తెలుసుకుని మోదీ ఆశ్చర్యపోయారు. కుమావత్ తో మాట్లాడుతూ, ఇకపై తన శక్తిసామర్థ్యాలను దేశాభివృద్ధికి ఉపయోగపడే మంచి పని కోసం ఖర్చు చేయాలని తెలిపారు. అంతకంటే విలువైన ఓ ఆత్మీయ సలహాను కూడా అందించారు. శారీరక ఇబ్బందికి కారణమయ్యే ఎలాంటి శపథం చేయవద్దని సూచించారు.

  • Loading...

More Telugu News