: హైకోర్టును ఆశ్రయించిన 25 మంది డీఎస్పీ, అదనపు ఎస్పీలు


సీనియారిటీలో అక్రమాలు జరిగాయంటూ 25 మంది డీఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉమ్మడి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. అక్రమాలపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలని విన్నవించారు. దానిపై స్వతంత్ర కమిటీ నియమించి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ, అదనపు ఎస్పీల వ్యాజ్యాన్ని హైకోర్ట్ విచారణకు స్వీకరించింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సహా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇచ్చింది.

  • Loading...

More Telugu News