: వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ వీసా గడువు పొడిగించిన కేంద్రం
వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ వీసా గడువును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరో ఏడాది పొడిగించింది. తన వీసా గడువును పొడిగించాలన్న తస్లీమా విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. తన వీసా గడువు పొడిగింపుపై తస్లీమా సంతోషం వ్యక్తం చేశారు. అయితే, ఏడాది కంటే ఎక్కువ పొడిగిస్తారని ఆశించినట్టు తెలిపారు. ఏదేమైనా, ఇది శుభవార్త అని పేర్కొన్నారు. తను రాసిన కొన్ని వ్యాసాలు, 'లజ్జ' నవల కారణంగా తస్లీమా ముస్లిం ఛాందసవాదుల ఆగ్రహానికి గురయ్యారు. ఆమెపై ఫత్వా కూడా జారీ అయింది. దాంతో, ఆమె బంగ్లాదేశ్ ను వీడాల్సి వచ్చింది. అటుపై స్వీడన్ చేరి, కొన్నాళ్ల తర్వాత పారిస్ వెళ్లారు. చివరగా భారత్ చేరుకుని ఆశ్రయం పొందారు.