: బలవంతంగా లిఫ్టు తలుపులు తెరిచి అమిత్ షాను బయటికి తీసుకువచ్చారు!


బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాట్నాలో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. ఓ లిఫ్టులో చిక్కుకుపోయిన ఆయనను సీఆర్పీఎఫ్ సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. బీహార్ రాజధాని పాట్నాలో రాజ్ భవన్ కు సమీపంలో ఉన్న సర్కారు గెస్ట్ హౌస్ లో షా గురువారం బస చేశారు. బీజేపీ బీహార్ విభాగం అధ్యక్షుడు మంగళ్ పాండే, ఇతర నాయకులతో కలిసి ఆయన గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు వెళ్లేందుకు లిఫ్టులో ఎక్కారు. అయితే, అది మధ్యలో మొరాయించింది. దాంతో, అమిత్ షా సహా అందరూ తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు లిఫ్టులోనే నిస్సహాయుల్లా ఉండిపోయారు. లిఫ్ట్ డోర్లు మూసుకుపోగా, మొబైల్ ఫోన్లూ పనిచేయలేదు. అటు, లిఫ్ట్ కు సంబంధించిన ఎమర్జెన్సీ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసినా స్పందన లేదు. చివరికి ఎలాగోలా భద్రతా సిబ్బందికి సమాచారం చేరవేయగలిగారు. వెంటనే స్పందించిన సిబ్బంది లిఫ్టు తలుపులు బలవంతంగా తెరిచి అమిత్ షాను బయటికి తీసుకువచ్చారు. దాంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News