: తొలగించిన చోటే వైఎస్ చిత్ర పటాన్ని పెట్టండి... స్పీకర్ కు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల విజ్ఞప్తి


ఏసీ అసెంబ్లీ కార్యాలయం నుంచి తొలగించిన దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటో వివాదం ఇంకా ముగియలేదు. అసెంబ్లీ లాంజ్ లో తొలగించిన వైఎస్ చిత్రపటాన్ని గతంలో ఉన్నచోటే ఏర్పాటు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరారు. ఈ మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ ను కలసిన వారంతా వినతిపత్రం సమర్పించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వైఎస్ ఫోటో ఎలా తొలగిస్తారని, గత సంప్రదాయాలకు భిన్నంగా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో ఏకపక్షంగా వ్యవహరించారని, ఎక్కడి నుంచి వైఎస్ ఫోటో తీశారో అక్కడే పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కమిటీలో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తెలిపారని వైసీపీ నేతలు చెప్పారు.

  • Loading...

More Telugu News