: డీఎస్ కు పోస్టు వచ్చిందోచ్!... తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియామకం


సుదీర్ఘకాలం పాటు కొనసాగిన కాంగ్రెస్ పార్టీకి చేయిచ్చి ఇటీవలే ‘గులాబీ’ గూటికి చేరిన ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్)కు తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి దక్కింది. ఇప్పటికే ప్రభుత్వంలో పలువురు సలహాదారులున్నా, వాటన్నింటి కంటే కాస్తంత పై హోదాలో ‘ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు’గా డీఎస్ ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా డీఎస్ నియమితులయ్యారు. ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పదవిలో డీఎస్ ను నియమించిన ప్రభుత్వం, ఆయనకు కేబినెట్ హోదాను కల్పిస్తున్నట్లు కొద్దిసేపటి క్రితం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.

  • Loading...

More Telugu News